మోక్షజ్ఞ ఎంట్రీకి డైరెక్టర్ ఫిక్స్ నిజమేనా..?

నందమూరి బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం.. గత కొంతకాలంగా వార్తలు అయితే వస్తున్నాయి కానీ.. సినిమా పట్టాలెక్కడం లేదు. బాలయ్య నుంచి ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. దీంతో అసలు.. మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా..? ఉండదా..? ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. మళ్లీ మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ గురించి వార్తలు వస్తున్నాయి. బాలయ్య.. మాస్ డైరెక్టర్ కి మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే బాధ్యతలు అప్పగించారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ మాస్ డైరెక్టర్ ఎవరు..? ఈ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఊహించని విధంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆతర్వాత క్రిష్ డైరెక్షన్లో మోక్షజ్ఞ మూవీ అంటూ ప్రచారం జరిగింది. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మూవీతో మోక్షజ్క్షను పరిచయం చేయాలి అనుకున్నారు. అయితే.. క్రిష్ ఈమధ్య కాలంలో తెరకెక్కించిన ఘాటి మూవీ ప్లాప్ అవ్వడంతో.. బాలయ్య ప్లాన్ మారింది.. క్రిష్ డైరెక్షన్లో చేయాలనుకున్న ఈ క్రేజీ సీక్వెల్ ఆగిపోయింది.

బాలయ్య.. మలినేని గోపీచంద్తో చేస్తున్న మూవీతో బిజీ అయ్యారు. రీసెంట్ గా కొరటాల శివతో సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా మోక్షజ్ఞ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ ఇయర్లోనే నందమూరి మోక్షజ్ఞ సినిమా స్టార్ట్ చేసేలా బాలయ్య పక్కాగా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను ఊర మాస్ డైరెక్టర్ బోయపాటికి అప్పగించారని ప్రచారం జరుగుతుంది.

మోక్షజ్ఞ గురించి గత కొంతకాలంగా కొంత మంది దర్శకుల పేర్లు వార్తల్లోకి వచ్చాయి. ఇప్పుడు బోయపాటి శ్రీను పేరు తెర పైకి రావడం ఆసక్తికరంగా మారింది. తనకు సింహా, లెజెండ్, అఖండ, అఖండ 2.. ఇలా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి అయితేనే.. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి న్యాయం చేస్తారని భావించి, ఆ బాధ్యతలు ఆయనకు అప్పగించారట బాలకృష్ణ. అంతేకాదండోయ్.. ఈ ఏడాదే మోక్షజ్ఞ సినిమా పూర్తి చేయాలని చెప్పారని టాక్ వినిపిస్తోంది.. అయితే.. ఈ ఏడాది ఇంకా 5 నెలల సమయం మాత్రమే ఉండటంతో ఇది సాధ్యమయ్యే పని కాదు. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా బోయపాటి డైరెక్షన్లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా..? అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కనుంది..? అనేది బాలయ్య త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి.

Latest Articles

మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ

జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్