టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరుకు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. అలాగే కోలీవుడ్లో అప్పటి నుంచి ఇప్పటి వరుకు సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇప్పుడు మెగాస్టార్, సూపర్ స్టార్.. ఈ ఇద్దరూ పోటీకి సై అంటున్నారని.. బాక్సాఫీస్ దగ్గర పోటీ తప్పదని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. చిరు, రజినీ.. తమ సినిమాలతో ఎప్పుడు థియేటర్స్ లోకి రాబోతున్నారు..? ఈ ఇద్దరిలో ఎవరి సినిమా ఎక్కువుగా ఆకట్టుకునే ఛాన్స్ ఉంది..?
మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కంటే ముందు రావాల్సిన సినిమా విశ్వంభర. డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించాలని.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో విశ్వంభర మూవీని తెరకెక్కిస్తున్నాడు. భారీ సోషియో ఫాంటసీ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలంటే.. జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి కథ, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, నెవర్ బిఫోర్ వరల్డ్ సెటప్, వావ్ అనిపించే విజువల్స్.. ఇలా విశ్వంభర మూవీని కొత్తగా.. ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా.. అందించాలని వశిష్ట్ తపిస్తున్నాడు. అయితే… విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా ఇంత వరుకు రాలేదు. ఇప్పుడు రీషూట్ చేస్తున్నారని.. చిరు కూడా డేట్స్ ఇచ్చారని తెలిసింది. అయితే.. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీకి వచ్చిందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఈ దసరాకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమాని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారని.. అక్టోబర్ 16న విశ్వంభర మూవీని రిలీజ్ చేయనున్నారని సమాచారం.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మూవీ జైలర్ 2. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్. జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. సీక్వెల్ గా రూపొందుతోన్న జైలర్ 2 మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అసలు ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కావాలి కానీ.. కుదరలేదు. ఈ మూవీకి కూడా రీషూట్స్ చేశారు. ఆగష్టులో వస్తుంది.. సెప్టెంబర్లో వస్తుంది అంటూ ప్రచారం జరిగింది కానీ.. ఫైనల్ గా అక్టోబర్ 15న రిలీజ్ చేయనున్నారు. ఈ రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. దీంతో.. బాక్సాఫీస్ దగ్గర చిరు విశ్వంభర, రజినీ జైలర్ 2 మధ్య పోటీ తప్పదు అంటూ ప్రచారం జరుగుతుంది.
దసరా సీజన్, అందులోనూ విశ్వంభర ఫ్యామిలీ, చిన్న పిల్లలకు నచ్చే కథాంశంతో రూపొందింది. కాబట్టి అడ్వాంటేజ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. సరిగ్గా ఇదే సీజన్‌లో రజనీకాంత్ జైలర్ 2 కూడా వస్తుండడం ఆసక్తిగా మారింది. ఈ రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్లో విడుదల కాబోతున్నాయి. ఓ వైపు మెగాస్టార్, మరో వైపు సూపర్ స్టార్ సినిమాలు.. థియేటర్స్ లోకి వస్తే.. అభిమానులకు ఇంతకంటే కావాల్సిందేముంది? పండగే. కాకపోతే.. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువగా ఆకట్టుకునే ఛాన్స్ ఉందంటే.. తెలుగులో విశ్వంభర, తమిళ్లో జైలర్ 2కి ఛాన్స్ ఉంటుంది. రెండింటిలో కంటెంట్ బాగుంటే.. రెండు సినిమాలను ఆదరిస్తారు. చూడాలి మరి.. విశ్వంభర, జైలర్ 2 చిత్రాల్లో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో..?


