మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరుకు విడుదల కాలేదు.. మేకర్స్ ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు. మెగాస్టార్.. ఏమో బాబీ డైరెక్షన్లో 158 మూవీని చేస్తున్నారు. దీంతో విశ్వంభర అసలు వస్తుందా..? రాదో.. తెలియక సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు విశ్వంభర మూవీ కోసం రీషూట్ చేయనున్నారని.. త్వరలో మెగాస్టార్ విశ్వంభర రీషూట్లో జాయిన్ అవుతారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. విశ్వంభర రీషూట్ నిజమేనా..? ఈ భారీ సోషియో ఫాంటసీ మూవీకి మోక్షం ఎప్పుడు..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ మూవీ అంటే.. జగదేకవీరుడు అతిలోక సుందరి. ఆ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆతర్వాత మళ్లీ ఆతరహా కథతో రూపొందుతోన్న విశ్వంభర మూవీ పై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. వీఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్నట్టుగా రాకపోవడం.. గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. క్వాలిటీ సరిగా లేదనే కామెంట్లు రావడంతో లేట్ అయినా ఫరవాలేదు లేటెస్ట్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో మరింత కేర్ తీసుకుని వర్క్ చేస్తున్నారు. అందుకనే మేకర్స్ ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదట. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ కు సంబంధించి రీషూట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.
ఈ మూవీకి సంబంధించి మరో న్యూస్ ఏంటంటే.. ఇప్పుడు కొత్త ఎపిసోడ్ యాడ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. కథను మరింత ఇంపాక్ట్ గా మార్చేందుకు, క్లైమాక్స్‌కు మరింత బలం చేకూర్చేందుకు ఈ కొత్త ఎపిసోడ్‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సీన్స్ షూట్ చేయడం కోసం చిరంజీవి నాలుగైదు రోజులు డేట్స్ ఇచ్చారట. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత విశ్వంభర రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందని.. అప్పుడు రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటిస్తారని తెలిసింది.
విజువల్ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో, చివరి దశ పనులు కూడా కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంతో బిజీగా ఉన్నారు మెగాస్టార్. ఆ షెడ్యూల్ బ్రేక్ లో విశ్వంభరకు డేట్లు కేటాయించి, ఈ సినిమాని ఫినిష్ చేసే ప్లాన్లో ఉన్నారట. తాజా సమాచారం ప్రకారం.. ఈ భారీ సోషియో ఫాంటసీ మూవీని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నారట. డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. యు.వీ క్రియేషన్స్ క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. మరి.. లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి విశ్వంభర ఆకట్టుకుంటుందేమో చూడాలి.


