కిరణ్ అబ్బవరం లైనప్ మామూలుగా లేదుగా..

కిరణ్ అబ్బవరం.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. అంచలంచలుగా ఎదుగుతున్నాడు. హీరోగానే కాకుండా.. రైటర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా.. ఇలా తనలోని టాలెంట్ ని బయటపెడుతూ కెరీర్ లో దూసుకెళుతున్నాడు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే.. కిరణ్ లైనప్ మామూలుగా లేదు.. అదిరింది అనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. కిరణ్ లైనప్ ఏంటి..?

యంగ్ హీరోల్లో స్ట్రాంగ్ లైనప్ అంటే.. కిరణ్ అబ్బవరం లైనప్పే. కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు వరుసగా సక్సెస్ సాధించినా.. ఆతర్వాత వరుసగా ఫ్లాపుల కూడా చూశాడు. అయితే.. క అనే డిఫరెంట్ మూవీతో సక్సెస్ సాధించి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. ఇక అక్కడ నుంచి స్పీడు పెంచాడు. నిర్మాతగా మారాడు.. ఇప్పుడు దర్శకుడిగా సినిమా చేస్తున్నాడు. జులైలో చెన్నై లవ్ స్టోరీ అనే విభిన్నమైన ప్రేమకథతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్ కు అనూహ్య స్పందన రావడంతో సినిమా పై పాజిటివ్ టాక్ ఉంది. ఈ మూవీతో కిరణ్ మరో మెట్లు ఎక్కడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.

కిరణ్‌ అబ్బవరం.. డైరెక్టర్ గా రియాలిటీ అనే మూవీ చేస్తున్నాడు. కథ నచ్చడంతో ఈ సినిమాని తనే డైరెక్ట్ చేయాలని పట్టుదలతో చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. సుకుమార్ శిష్యుడు ఈ మూవీకి డైరెక్టర్. స్టోరీ లాక్ అయ్యిందని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. త్వరలో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. క మూవీకి సీక్వెల్ చేయాలి. అయితే.. క మూవీ డైరెక్టర్స్ సుజిత్, సందీప్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో సినిమా చేస్తుండడంతో క సీక్వెల్ ఉంటుందా..? ఉండదా..? అనేది సస్పెన్స్ గా మారింది. అయితే.. లేట్ అయినా క సీక్వెల్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలే కాకుండా కిరణ్.. ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. గువ్వల చెరువు అనే టైటిల్తో రూపొందే ఈ సిరీస్ కు డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్ కమ్మ డైరెక్టర్. అమేజాన్ ప్రైమ్ ఈ సిరీస్ ని నిర్మిస్తోంది. కాస్టింగ్ కూడా వైవిధ్య‌భ‌రితంగా ఉండ‌బోతోంద‌ని టాక్‌. వీటితో పాటు కాంతార చిత్రానికి వర్క్ చేసిన శ్రీ‌కాంత్ పుప్పాల ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఓ చిత్రం చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా మూవీ. కిర‌ణ్ అబ్బవరం చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే. ఇలా ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ.. స్ట్రాంగ్ లైనప్ తో దూసుకెళుతున్నాడు కిరణ్ అబ్బవరం.

Latest Articles

ఏక్‌నాథ్‌ షిండే క్యాంపులో చేరిన రెబల్‌ ఉద్ధవ్‌ సేన ఎంపీలు

ఉధ్దవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్‌ షిండేకు చెందిన శివసేన పార్టీలో చేరారు. ఏక్‌నాథ్‌ షిండే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్టైంది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్