సమంత.. మా ఇంటి బంగారం అంటూ ప్రేక్షకుల ముందుకు రావడం.. ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం తెలిసిందే. అయితే.. సామ్.. సినిమాకి కలెక్షన్స్ వస్తాయా..? వస్తే.. ఏ రేంజ్లో వస్తాయి అని ఎదురు చూసిన సినీ జనాలకు సామ్ షాక్ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా బాక్సాఫీస్ దగ్గర సామ్ తన పవర్ చూపించింది. ఇంతకీ.. సామ్ బంగారంకు వచ్చిన కలెక్షన్స్ ఎంత..? ఈ మూవీ ద్వారా ఫిల్మ్ మేకర్స్ తెలుసుకున్న వాస్తవం ఏంటి..?
సమంత కొంత గ్యాప్ తర్వాత నటించిన మూవీ మా ఇంటి బంగారం. ఈ సినిమాని జనాలు ఇంతకు ముందులా రిసీవ్ చేసుకుంటారా..? ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలను కూడా హిట్ అయితేనే చూస్తున్నారు కదా.. సమంత మూవీ కోసం జనాలు థియేటర్స్ కి వస్తారా..? ఇలా కొన్ని డౌట్స్ ఉండేవి. అది కాకుండా సమంత నటించిన శాకుంతలం సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో సమంత పనైపోయిందనే విమర్శలు వచ్చాయి. అయితే.. తన సినిమా పై ఉన్న డౌట్స్ కి అలాగే విమర్శలకు సామ్ మా ఇంటి బంగారం సినిమాతో సమాధానం చెప్పింది.
ఈ సినిమాకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ఇండస్ట్రీ జనాలు షాకయ్యారు. చాలా మంది టైర్ 2 హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో బుకింగ్స్ జోరు కనిపించింది. ఇక ఈ మూవీకి మరీ గొప్ప టాకేమీ రాకపోయినా.. తొలి రోజు బలంగా నిలబడింది. శని, ఆదివారాల్లో వసూళ్లు ఇంకా పెరిగాయి. శనివారం హౌస్ ఫుల్స్‌తో రన్ కావడమే కాక.. స్క్రీన్లు, షోలు కూడా పెంచారు. ఆదివారం కూడా రన్ చాలా బాగుంది. ఈ చిత్రం యుఎస్‌లో ప్రిమియర్స్‌తోనే హాఫ్ మిలియన్ మార్కును అందుకుని ఇప్పుడు 1 మిలియన్ ని క్రాస్ చేసింది. దీంతో అక్కడి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురి చేసింది. ఈ మూవీ 3 రోజులకు వరల్డ్ వైడ్ గా 43 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.
టైర్ 2 హీరోలకు ఓవర్ సీస్ లో 1 మిలియన్ క్రాస్ చేయడం అనేది పెద్ద టాస్కుగా మారింది. అలాంటిది సమంత చాలా ఈజీగా 1 మిలియన్ క్లబ్ లో అడుగు పెట్టడం ఆసక్తిగా మారింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ దగ్గర సామ్ తన దూకుడు చూపిస్తుంది. ఒక హీరోయిన్ ఈ స్థాయిలో తన స్టార్ పవర్ చూపించడంతో.. హీరోల్లో గుబులు రేపుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా ద్వారా తెలిసింది ఏంటంటే.. కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి నిరూపించింది. కంటెంట్ బాగుంటే.. జనాలు ఆదరిస్తారు. మరి.. సామ్ బంగారం బాక్సాఫీస్ దగ్గర ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.


