నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రశాంతి రెడ్డి రేణిగుంటలో మెస్సుతో పాటు తట్టల వ్యాపారం చేశారేమోనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలతో ఎమ్మెల్యేలు అయ్యారని.. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినోళ్లు కారని ఆరోపించారు. రెండేళ్లలో తాము చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన సచివాలయాల ముందు సభలు పెట్టి మాట్లాడుతూ అభివృద్ధి చేయలేదని మాట్లాడడం మంచిది పద్దతి కాదన్నారు. ప్రశాంతమైన కోవూరు నియోజకవర్గంలో కొంతమంది టిడిపి నాయకులు రౌడీయిజంకి తెర లేపుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసినందుకు దామరమడుగు గ్రామానికి చెందిన వంశీ పై మండల పార్టీ అధ్యక్షుడు అడ్డగించి దాడి చేశారని ఆరోపించారు. రౌడీయిజం తాము కూడా చేయగలుగుతాం కానీ అది మంచిది కాదన్నారు. రౌడీయిజం చేస్తున్న నాయకులపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈవీఎం ఎమ్మెల్యేలు.. ప్రజలు ఓట్లు వేస్తే గెలవలేదు- ప్రసన్నకుమార్ రెడ్డి
0
59
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


