హైదరాబాద్‌ మణికొండ శివాజీ నగర్‌లో అమావాస్య పూజల వివాదం

హైదరాబాద్‌లోని మణికొండ శివాజీ నగర్‌లో అమావాస్య పూజల వివాదం రేగింది. మణికొండ శివాజీ నగర్‌లో అమావాస్య రోజు నిర్వహించిన ప్రత్యేక పూజలు వివాదానికి దారితీశాయి. ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఉంచి పూజలు చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పూజలు చుట్టుపక్కల వారిలో భయాందోళనలు కలిగిస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో సంబంధిత కుటుంబాన్ని ప్రశ్నించగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీయగా, ఓ మహిళ ఎదురింటి వారి కళ్లలో కారం చల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనతో శివాజీ నగర్‌లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Latest Articles

తమిళనాడు సీఎం విజయ్‌ సంచలన నిర్ణయం… రైతులకు రుణమాఫీ

తమిళనాడు సీఎం విజయ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ ప్రకటించారు. రూ.75,000 మేరకు రైతులకు సహకార రంగంలో వ్యవసాయ రుణాల మాఫీ చేయాలని విజయ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్