సుహాస్ సరికొత్త పాత్రలో.. మండాడి

కలర్ ఫోటో, హిట్ 2, రైటర్ పద్మభూషణ్‌, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు.. ఇలా విభిన్న కథా చిత్రాలతో మెప్పించిన టాలెంటెడ్ ఆర్టిస్ట్ సుహాస్. ఇప్పుడు మండాడి అనే మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లో బజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమాని సెప్టెంబర్ 4న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ.. ఈ మూవీ ఎలా ఉండబోతుంది..?

సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మండాడి. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమాపై అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ అంచనాలు అమాంతం పెరిగాయి. తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో సూరి, సుహాస్ ఇద్దరూ కూడా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తారు. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ ఆల్రెడీ పూర్తయింది.

రియల్ లొకేషన్స్‌లో ఎంతో శ్రమించి ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఒళ్లుగగుర్పొడిచే సెయిల్‌బోట్ రేస్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాని సెప్టెంబర్ 4న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్‌ను తాజాగా రివీల్ చేశారు. ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో సుహాస్, సూరి ఎదురెదురుగా నిల్చుని కనిపిస్తున్నారు. ఈ మూవీలో ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉండబోతోన్నాయని సమాచారం.

ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సూరి, సుహాస్ మార్కెట్‌ను, వారి స్థాయిని పెంచేలా ఈ సినిమా ఉంటుంది. ఇక మున్ముందు మరిన్ని ప్రమోషనల్ అప్డేట్‌లతో మండాడి పై అంచనాలు పెంచనున్నారు. సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

Latest Articles

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య

హైదరాబాద్‌లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్