కత్తులతో కాలేజి మాజీ ప్రిన్సిపల్‌ కొడుకు దాడి.. ఒకరు మృతి

బాపట్ల జిల్లా చీరాల (మం) ఈపురుపాలెంలో ఓ ప్రైవేటు ఐటీఐ కళాశాలలో కత్తిపోట్ల కలకలం రేగింది. కళాశాల సిబ్బందిపై కుమారుడు జిలానితో కలసి.. కత్తులతో కాలేజి మాజీ ప్రిన్సిపల్ అబ్దుల్ సత్తార్ దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఆర్థికలావాదేవీల విషయంలో కొంతకాలంగా సత్తార్ కు.. కమిటీ మెంబర్స్ మధ్య వివాదం నడుస్తోంది. కళాశాలలోకి ఒక్కసారిగా కత్తితో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కళాశాల కమిటీ మెంబర్‌ హుస్సేన్‌, ప్రిన్సిపల్‌ శేషయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికత్స పొందుతూ హుస్సేన్‌ మృతి చెందాడు.

Latest Articles

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య

హైదరాబాద్‌లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్