రూ.కోటి ఆర్థికసాయం ఇవ్వాలి-జగన్

స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం బాధాకరమని మాజీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి అన్నారు. విశాఖలో పర్యటించిన ఆయన.. స్టీల్‌ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలతో మాట్లాడి ఓదార్చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. “కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలి. వైసీపీ హయాంతో కార్మికులకు ఇబ్బందులు రాలేదు. వైసీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది. కూటమి హయాంలో ఎలా ఉందో గమనించాలి. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వైసీపీ అడ్డుకుంది. ప్రైవేటీకరణ జరగకూడదని గట్టిగా చెప్పాం. ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. గాయపడ్డ ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 95 శాతం కాలిన గాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌లో 6,500 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించారు. వీఆర్‌ఎస్‌ పేరుతో మరికొంత మంది ఉద్యోగులను తప్పించారు” .. అని జగన్‌ అన్నారు.

Latest Articles

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్