వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరొకరు మరణించడంతో.. మృతుల సంఖ్య 9కి చేరుకుంది. ప్రమాదంలో గాయపడిన పైడి రాజు అనే కార్మికుడు సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ప్రమాదం జరిగిన తర్వాత పైడి రాజు తన కుటుంబ సభ్యుల కోసం తీసిన వీడియో కంటతడి పెట్టిస్తోంది. వర్మ తమ్ముడిపై కోప్పడకు, తమ్ముడిని బాగా చదివించు. నువ్వు కూడా బాగా చదువుకో. అమ్మని బాగా చూసుకోండి. డాడీ.. ఇక ఉంటాను. అంటూ రాజు చెబుతున్న మాటలు వింటుంటే మనసున్న ఎవ్వరికైనా ఏడుపు రాక మానదు. పైడి రాజు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. చావు బతుకుల్లోనూ భర్త తన భార్య కోసం, తన పిల్లల కోసం పడిన ఆరాటం చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
మరో కార్మికుడి కన్నుమూత.. అమ్మని బాగా చూసుకో… వీడియో వైరల్
0
74
Previous article
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


