మైనింగ్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం

తెలంగాణలో మైనింగ్ అక్రమాల కేసులో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం ఆరు ప్రాంతాల్లో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
మైనింగ్ కార్యకలాపాలు, అనుమతులు, లీజులు, రవాణా వివరాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఆయా జిల్లాల మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్లు (ADలు) నుంచి కీలక సమాచారం తీసుకున్నారు. అక్రమ తవ్వకాలు, రాయల్టీ ఎగవేత, నిబంధనల ఉల్లంఘనలపై విచారణ కొనసాగుతోంది. గతంలో జారీ చేసిన అనుమతులు, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. సంబంధిత పత్రాలు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు.

సోదాల్లో లభించిన వివరాల ఆధారంగా మరిన్ని అధికారులను విచారించే అవకాశం ఉంది. కేసుకు సంబంధించి సీఐడీ త్వరలో కీలక వివరాలు వెల్లడించే అవకాశముందని సమాచారం.

Latest Articles

సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?

క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్