తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై సమర్పించిన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించినట్టు బీజేపీ ప్రకటించింది. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సోషల్ మీడియా వేదికగా ప్రజలతో ఓపెన్ అండ్ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కొన్ని గంటల ముందు ఆయన రాజనామా వార్త వెలువడడంతో ఆసక్తి నెలకొంది. ఆయన తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నారు. రాజీనామాకు ముందు అన్నామలై ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీతో ఉన్న అనుబంధాన్ని స్నేహపూర్వకంగా ముగించుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం అమిత్ షా, బీఎల్ సంతోష్‌ను కూడా కలిశారు. అయితే వారు వెంటనే నిర్ణయం తీసుకోవద్దని.. కొంత సమయం వేచి ఉండాలని చెప్పినట్టు సమాచారం.
అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం
0
46
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


