బుధవారం కొత్త ముఖ్యమంత్రితో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం తన రాజీనామా లేఖను పంపించారు. కర్ణాటకలో కొలువుదీరిన డీకే శివకుమార్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ ప్రమాణ స్వీకారం జరిగిన రెండు రోజుల్లోనే మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తనకు కేటాయించిన శాఖలపై రామలింగారెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. బెంగళూరు నగర అభివృద్ధి శాఖను ఆశించిన రామలింగారెడ్డికి ,…డీకే శివకుమార్ ఇరిగేషన్ శాఖను కేటాయించారు. సిద్ధరామలింగయ్య కేబినెట్‌లో ఆయన రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు.
తాను పదవులను ఆశించలేదని.. సిద్ధరామయ్య, డీకే కేబినెట్‌లో పదవులను కోరుకోలేదని రామలింగారెడ్డి అన్నారు. బెంగళూరు నగర అభివృద్ధిశాఖ ఇస్తామని..సీఎం డీకే శివకుమార్ హామీ ఇచ్చారని చెప్పారు. తనకు ఇదే శాఖ కావాలని డిమాండ్ చేయలేదని చెప్పారు. ఇచ్చిన మాట తప్పినందుకే రాజీనామా చేశానని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశారు రామలింగారెడ్డి.


