రెండేళ్లుగా చంద్రబాబు అరాచక పాలన చేస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాలనలో మహిళలు ఎక్కువగా మోసపోయారన్నారు. సూపర్ సిక్స్ అమలు చేశామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో చెప్పినవి చేయలేదు.. ఉన్నవి లాగేసి దోపిడీ చేశారన్నారు. మహిళలకు 50 శాతం పదవులు ఇచ్చేందుకు చట్టం చేశామన్న సజ్జల.. మహిళలకు ఇచ్చిన హామీలన్నీ జగన్ అమలు చేశారని చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.25 వేల కోట్ల రుణమాఫీ చేశారని.. చంద్రబాబును రాజకీయంగా అంతం చేసేది జగనే అని సజ్జల స్పష్టం చేశారు. అందుకే గొడ్డలి పార్టీ అని రోజూ ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. కూటమి పాలనలో అడ్డగోలు దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారని అన్నారు. మెగా డీఎస్సీ స్కామ్‌పై ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని సజ్జల తెలిపారు.
రెండేళ్లుగా చంద్రబాబు అరాచక పాలన చేస్తున్నారు-సజ్జల
0
5
Previous article
Next article
Latest Articles
కాంగ్రెస్‌ను దేశమంతా వదిలించుకుంటుంది- కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటరిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలు అమలు చేయాలని.. అలా చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌కి ఆ మాట...
- Advertisement -
- Advertisement -


