కోర్టు తీర్పులలో జాప్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తీర్పులను రిజర్వ్ చేసిన తర్వాత, దేశంలోని అన్ని హైకోర్టులు గరిష్టంగా మూడు నెలల్లోగా తీర్పులను వెలువరించాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం, తీర్పులలో జాప్యం పిటిషనర్లకు పూడ్చలేని నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో విచారణలను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా సూచించింది. బెయిల్ దరఖాస్తులపై తీర్పులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ రిజర్వ్ చేస్తే, మరుసటి రోజే వాటిని వెలువరించి అప్‌లోడ్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. బెయిల్ మంజూరు లేదా శిక్ష నిలుపుదల ఉత్తర్వులు వెలువడిన వెంటనే జైలు అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది. విచారణలో ఉన్న ఖైదీని లేదా దోషిని వీలైతే అదే రోజు లేదా గరిష్టంగా మరుసటి రోజు విడుదల చేయాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు తీర్పులలో జాప్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
0
32
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


