ప్రపంచానికే తలమానికంగా ఉండేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, .శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం నాడు మంత్రులు ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన తేదీలపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు
0
77
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


