రెండు దశాబ్దాల కాలంలో తొలిసారిగా జపాన్ భారతీయ మామిడి దిగుమతులను నిలిపివేసింది. ఇది వేసవి కాలంలో ఎగుమతిదారులకు ఎదురుదెబ్బ. ప్రతి ఏటా ఆ దేశానికి విస్తృతంగా ఎగుమతి అయ్యే అల్ఫోన్సో, కేసర్, లంగ్రా, బంగనపల్లి వంటి ప్రీమియం భారతీయ రకాలపై ప్రభావం చూపుతుంది. మార్చిలో నిర్వహించిన తనిఖీల సందర్భంగా.. భారతీయ మామిడి శుద్ధి కేంద్రాలలో ఫ్యూమిగేషన్ , క్రిమిసంహారక ప్రక్రియలలో లోపాలను జపాన్ ప్లాంట్ క్వారంటైన్ అధికారులు కనుగొన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జపాన్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వృక్ష ఆరోగ్య నిబంధనలను పాటిస్తోంది. దేశీయ వ్యవసాయానికి తీవ్ర నష్టం కలిగించే పండ్ల ఈగలు వంటి హానికరమైన తెగుళ్లను జపాన్ దేశం ఏమాత్రం సహించదు.
భారత మామిడి దిగుమతులను నిలిపివేసిన జపాన్.. రెండు దశాబ్దాల్లో తొలిసారి
0
86
Previous article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


