టాలీవుడ్‌లో చాలా కాలంగా కొనసాగుతున్న పర్సంటేజి వివాదం ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో సినీ ఇండస్ట్రీలో పర్సంటేజి వివాదం సద్దుమణిగింది. బుధవారం చిరంజీవితో మరోసారి తెలంగాణ ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. పర్సంటేజీ విధానంపై ఆయనతో చర్చించారు. రెంటల్ విధానంలోనే పెద్ది సినిమాను ప్రదర్శించేలా నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ టికెట్ ధరలు పెంచితే 7.5 శాతం ఎగ్జిబిటర్లకు చెల్లించేలా ఒప్పందానికి వచ్చారు. జూన్ 30 తర్వాత విడుదలయ్యే సినిమాలను.. పర్సంటేజీతో ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయాన్ని చిరంజీవికి తెలిపారు. అయితే ఫిలిం చాంబర్ కమిటీ నివేదిక ప్రకారం నడుచుకోవాలని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌కు చిరంజీవి సూచించారు.
చిరంజీవి జోక్యంతో సద్దుమణిగిన పర్సంటేజి వివాదం
0
37
Previous article
Next article
Latest Articles
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -
- Advertisement -


