ధడ పుట్టిస్తున్న ఎబోలా వైరస్‌ వ్యాప్తి.. భారత్‌లోకి ప్రవేశించిందా?

ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాల్లో మళ్లీ కలవరం మొదలైంది. ఎబోలా అనేది అంత్యంత అరుదైన వైరస్‌ రకానికి చెందినది. ఇది ప్రాంణాతకమైన వైరస్‌. దీనికి టీకా లేదు. ఎబోలా వైరస్‌ వ్యాప్తి ఊహించినదానికంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని WHO ప్రకటనతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వ్యాప్తి ఇలాగే కొనసాగితే ఈ మహమ్మారిని ఎదుర్కోవడం కష్టమనే కలవరం మొదలైంది. ఒకప్పటి కోవిడ్‌ పరిస్థితులు వస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కేంద్రం అప్రమత్తం… అడ్వైజరీ జారీ

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ నుంచి వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఎయిర్‌పోర్టులు, ఓడరేవులకు హెచ్చరికలు జారీ చేసింది కేంద్రం. స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. జ్వరం, తలనొప్పి, నీరసం, కండరాల నొప్పులు తదితర సమస్యలు కనిపిస్తే వెంటనే ఎయిర్‌పోర్టు ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రయాణం చేసిన 21 రోజుల్లోగా ఈ లక్షణాలు కనిపించినా స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయాలని సూచించారు.

కీలక సదస్సు వాయిదా

మరోవైపు భారత్, ఆఫ్రికన్‌ యూనియన్‌ మద్య జరగాల్సిన కీలక సదస్సు వాయిదా పడింది. మే 28 నుంచి ఢిల్లీలో నిర్వహించాల్సిన నాలుగో ఇండియా-ఆఫ్రికా ఫోరం సమ్మిట్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికాలో ప్రాణాంతక ఎబోలా వైరస్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రత్యేకంగా డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో దేశంలోని సౌత్‌ కివు ప్రాంతంలో తాజాగా ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. దీంతో అప్రమత్తత పెరిగింది.

ఎబోలా వైరస్‌ అంటే ఏమిటి?

ఎబోలా అనేది మనుషుల్లో కనిపించే అరుదైన వ్యాధి కానీ.. అత్యంత ప్రమాదకరమైన వైరస్‌. చాలా సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది.

ఎబోలా వ్యాధి ఫిలోవిరిడే కుటుంబానికి చెందిన ఆర్థోఎబోలావైరస్ జీనస్ వైరస్‌ల వల్ల వస్తుంది. ఇప్పటివరకు ఆరు రకాల ఆర్థోఎబోలావైరస్‌లు గుర్తించగా… వాటిలో మూడు రకాల వైరస్‌లు పెద్దఎత్తున వ్యాప్తికి కారణమయ్యాయి

ఎబోలాకు సరైన మందులు, వ్యాక్సిన్లు లేవు. వ్యాధి ప్రారంభదశలోనే గుర్తించి సరైన వైద్యం తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు

ఎబోలా వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది. నేరుగా సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ఇక చర్మంపై గాయాలు ఉన్నప్పుడు లేదా కళ్లు, ముక్కు, నోటి వంటి మ్యూకస్ మెంబ్రేన్‌ల ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఎబోలా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి రక్తం లేదా శరీర ద్రవాలను నేరుగా తాకడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. రక్తం, మలం, వాంతులు వంటి శరీర ద్రవాలతో కలుషితమైన వస్తువులు లేదా ఉపరితలాలను తాకడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది.

ఒక వ్యక్తికి ఈ వైరస్‌ లక్షణాలు బయటపడకముందే ఇతరులకు వ్యాపించే అవకాశం లేదు. లక్షణాలు ప్రారంభమైన తర్వాత మాత్రమే ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. రోగి రక్తంలో వైరస్‌ ఉన్నంత కాలం ఇతరులకు వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది. రోగికి చికత్స అందించే సమయంలో డాక్టర్‌, నర్సు, సహాయకులు కూడా ఈ వైరస్‌ బారిన పడిన ఘటనలు కూడా ఉన్నాయి.

అంతే కాదు వ్యాధితో చనిపోయిన మనిషి అంత్యక్రియల సమయంలో డెడ్‌బాడీని తాకిన వారికి కూడా ఎబోలా సోకే ప్రమాదం ఉంది.

ఎబోలా లక్షణాలు

ఎబోలా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన 2 నుంచి 21 రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. అధిక జ్వరం, తీవ్రమైన అలసట, శరీర బలహీనత, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతునొప్పి లక్షణాలు బయటపడతయి.

ఇంకా వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ లక్షణాలు కనిపిస్తాయి,

వాంతులు
విరోచనాలు
కడుపునొప్పి
చర్మంపై దద్దుర్లు
కిడ్నీలు, కాలేయంలో ఇబ్బందులు

కొన్ని సందర్భాల్లో

వాంతుల్లో రక్తం వస్తుంది
మలంలో రక్తం కనిపిస్తుంది
ముక్కు నుంచి రక్తస్రావం
దవడల నుంచి రక్తం కారడం
మహిళల్లో యోని ద్వారా రక్తస్రావం

ఎబోలా వైరస్‌ మెదడు, నాడీ వ్యవస్థపై కూడా ప్రభాం చూపించవచ్చు

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్