దిగజారిపోతున్న ఖతార్ ఆర్థిక పరిస్థితి

ఖతార్‌ (Qatar).. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ గల్ఫ్ దేశం ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇరాన్‌ యుద్ధం(Iran War) ప్రభావంతో సహజ వాయువు ఎగుమతులు దెబ్బతినడం, దిగుమతులపై ఆధారపడిన ఆహార సరఫరా సంక్షోభంలో పడటం, పర్యాటక రంగం క్షీణించడం వల్ల ఖతార్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది.

ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఖతార్‌ను సహజ వాయువు సంపద ప్రపంచ ఆర్థిక పటంలో నిలబెట్టింది. ముఖ్యంగా ఈశాన్య ఖతార్‌లోని నార్త్‌ ఫీల్డ్‌( North Field) ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు నిల్వలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడి గ్యాస్‌ను ద్రవరూపంలోకి మార్చి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) రూపంలో ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ ఖతార్ భారీ ఆదాయాన్ని ఆర్జించింది.

1996లో తొలిసారి జపాన్‌కు LNG ఎగుమతులు ప్రారంభించిన ఖతార్, 2010 నాటికి సంవత్సరానికి 7 కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించింది. ప్రస్తుతం దేశ ఆదాయంలో దాదాపు 60 శాతం గ్యాస్ , గ్యాస్ సంబంధిత ఎగుమతుల నుంచే వస్తోంది.

అయితే పశ్చిమాసియాలో ప్రారంభమైన యుద్ధ ఉద్రిక్తతలు ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారాయి. ప్రపంచంతో వాణిజ్య సంబంధాలకు కీలకమైన హర్మూజ్‌ ( Strait of Hormuz) జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఖతార్ ఎగుమతులు, దిగుమతులు దాదాపు నిలిచిపోయాయి.

ఈ పరిణామాలతో దేశ అతిపెద్ద ఇంధన సంస్థ QatarEnergy అంతర్జాతీయ కాంట్రాక్టులను సమయానికి పూర్తి చేయలేమని ప్రకటించింది. దీనికి తోడు ఖతార్ ప్రధాన గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రం అయిన Ras Laffan Industrial City పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ దాడులతో గ్యాస్ ఉత్పత్తి కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. దాని పునరుద్ధరణకు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఖతార్ ప్రజల రోజువారీ ఆహార అవసరాలు కూడా ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడి ఉంటాయి. సముద్ర మార్గాలు మూసుకుపోవడంతో ప్రస్తుతం ఆహార పదార్థాలను వాయుమార్గంలో దిగుమతి చేసుకుంటున్నారు. దీనివల్ల ఖర్చులు భారీగా పెరిగి ద్రవ్యోల్బణ భయాలు మొదలయ్యాయి.

ఇక యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు గల్ఫ్ ప్రాంతానికి ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేయడంతో పర్యాటక రంగం కూడా దెబ్బతింది. హోటళ్లు, చిన్న వ్యాపారాలు ఆదాయం కోల్పోతుండగా పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) అంచనా ప్రకారం, ఈ ఏడాది ఖతార్ ఆర్థిక వ్యవస్థ 8.6 శాతం వరకు క్షీణించే ప్రమాదం ఉంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశ విదేశీ మారక నిల్వలు కూడా కరిగిపోయే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Latest Articles

కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..

మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్