హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలోని డాలర్ హిల్స్ అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఐదో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఆ సమయంలో లిఫ్ట్‌లో ఉన్న ఆరుగురు బీఆర్‌ఎస్ నాయకులు గాయపడ్డారు.
వైరులు తెగిపోవడంతో లిఫ్ట్ కుప్పకూలినట్లు సమాచారం. గాయపడిన వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి.
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


