అమెరికా పతనం అంచున ఉందన్న జిన్‌పింగ్‌…. అవునన్న ట్రంప్‌… కానీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌( Donald Trump) చైనా పర్యటన చివరి రోజున కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌( Xi Jinping) అమెరికాను పతనం అంచున ఉన్న దేశంగా పేర్కొన్నారన్న వ్యాఖ్యలపై స్పందించారు. ఆ వ్యాఖ్యలు తన పాలనపై కాకుండా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌( Joe Biden) హయాంపై చేసినవేనని ట్రంప్ తెలిపారు.

బీజింగ్‌లో జరిగిన కీలక సమావేశాల సందర్భంగా జిన్‌పింగ్ “థుసిడిడీస్ ట్రాప్” (Thucydides Trap) గురించి ప్రస్తావించారు. ఎదుగుతున్న శక్తి , ఆధిపత్య దేశం మధ్య యుద్ధ పరిస్థితులు తలెత్తే అవకాశాన్ని సూచించే ఈ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ అమెరికా-చైనా సంబంధాలను స్థిరంగా ఉంచడం ప్రపంచానికి అవసరమని జిన్‌పింగ్ పేర్కొన్నారు. అయితే ఆయన నేరుగా “అమెరికా క్షీణిస్తున్న దేశం” అని చెప్పలేదు.

అయితే ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌( Truth Social)లో చేసిన దీర్ఘ పోస్టులో జిన్‌పింగ్ వ్యాఖ్యలను తనదైన శైలిలో వివరించారు. అమెరికా గత నాలుగేళ్లలో భారీ నష్టాన్ని చవిచూసిందని, ముఖ్యంగా బైడెన్ ప్రభుత్వ విధానాల వల్ల దేశం బలహీనపడిందని ఆరోపించారు.

“జో బైడెన్ పాలనలో ఓపెన్ బోర్డర్లు, అధిక పన్నులు, జెండర్ పాలసీలు, మహిళల క్రీడల్లో పురుషులు పాల్గొనడం, డీఈఐ విధానాలు, చెడు వాణిజ్య ఒప్పందాలు, పెరుగుతున్న నేరాలు వంటి కారణాలతో అమెరికా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ఆ విషయంలో జిన్‌పింగ్ 100 శాతం సరైనదే చెప్పారు,” అని ట్రంప్ పేర్కొన్నారు.

అయితే తన పాలనలో అమెరికా మళ్లీ బలపడిందని ట్రంప్ అన్నారు. గత 16 నెలల్లో స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరాయని, ఉద్యోగ అవకాశాలు పెరిగాయని, విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చాయని, అమెరికా సైనిక శక్తి మరింత బలపడిందని ఆయన తెలిపారు.

“ప్రస్తుతం అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మారింది. జిన్‌పింగ్ కూడా నా విజయాలను అభినందించారు,” అని ట్రంప్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా అమెరికా-చైనా సంబంధాల్లో ఇంకా పలు కీలక విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, తైవాన్ అంశాల్లో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తైవాన్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని జిన్‌పింగ్ ట్రంప్‌కు హెచ్చరించినట్లు చైనా వర్గాలు వెల్లడించాయి.

అదే సమయంలో మెక్సికోకు అక్రమ ఫెంటానిల్ తయారీలో ఉపయోగించే రసాయనాల సరఫరాను చైనా ఇంకా పూర్తిగా అడ్డుకోవడం లేదని అమెరికా ఆరోపిస్తోంది.

ట్రంప్, జిన్‌పింగ్ బీజింగ్‌లో మరిన్ని సమావేశాలు నిర్వహించిన అనంతరం ట్రంప్ తిరిగి వాషింగ్టన్‌కు బయలుదేరనున్నారు.

Latest Articles

జనగణనలో ఓబీసీ కాలమ్ లేకపోవడంపై వివాదం

జనగణనలో కులగణన అంశం ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తోంది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్