బండి భగీరథ్ కేసులో హైకోర్టు విచారణ.. రేపటికి వాయిదా

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay Kumar) కుమారుడు భగీరథ్‌కు సంబంధించిన కేసులో హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.

విచారణ సందర్భంగా బాధితురాలి వయస్సుకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అంశంపై స్పష్టత అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో డేట్ ఆఫ్ బర్త్‌లపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదిస్తూ… గతంలో దాఖలైన ఛార్జ్‌షీట్‌లో బాధితురాలి వయస్సు ఐదేళ్ల క్రితం 15 సంవత్సరాలుగా పేర్కొన్నారని తెలిపారు. అలాగే 2008, 2010 అంటూ రెండు వేర్వేరు జనన తేదీలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

voter information

ఇక భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ప్రీ, పోస్ట్ అంశాలపై కూడా పిటిషనర్ తరఫు వాదనలు వినిపించారు.

“బాధితురాలికి న్యాయం జరగాలి. అయితే పోలీసుల విచారణ సక్రమంగా జరగాలి. డేట్ ఆఫ్ బర్త్ విషయంలో స్పష్టత లేదు” అని న్యాయమూర్తి అన్నారు.

అలాగే బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ప్రకారం ఘటన జరగలేదని కూడా వాదించారు.

విచారణ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. “ఇలాగే కొనసాగితే వేరే బెంచ్‌కు వెళ్లండి… బెంచ్ మార్చేస్తా” అంటూ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్