హైదరాబాద్‌లోని గచ్చిబౌలి( Gachibowli) పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గౌలిదొడ్డిలో ఉన్న ‘మాహి ఉమెన్ పీజీ’ హాస్టల్‌లో లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. మృతురాలిని జార్ఖండ్‌కు చెందిన బిస్తు సేఫ్ (5)గా గుర్తించారు. బాలిక తన తాత, అమ్మమ్మలతో కలిసి హాస్టల్‌లో నివసిస్తున్నట్లు సమాచారం.
ఆడుకుంటూ ఉండగా గ్రిల్స్ కలిగిన లిఫ్ట్‌లో చిన్నారి చిక్కుకుపోయిందని, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనతో హాస్టల్‌లో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. లిఫ్ట్ భద్రతా ప్రమాణాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.


