37.2 C
Hyderabad
Wednesday, May 13, 2026
spot_img

45 ఏళ్ల తర్వాత ఇంటర్ పరీక్ష రాసిన మాజీ మావోయిస్టు నేత దేవ్‌జీ

మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌ జీ( Devji) దాదాపు 45 ఏళ్ల తర్వాత ఇంటర్ పరీక్షకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో బుధవారం జరిగిన ఇంటర్ తెలుగు పరీక్షను ఆయన రాశారు.

దేవ్‌జీ 1980-82 మధ్యకాలంలో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్‌లో ఇంటర్మీడియట్ చదివారు. ఆ సమయంలో విద్యార్థి రాడికల్ యూనియన్‌లో చురుకుగా పనిచేస్తూ రెండో సంవత్సరం తెలుగు పరీక్షను బహిష్కరించారు. అనంతరం ఆయన మావోయిస్టు ఉద్యమంలో చేరి అగ్రనేతగా ఎదిగారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో మావోయిస్టు ఉద్యమాన్ని వీడి సాధారణ జీవితంలోకి వచ్చిన దేవ్‌జీ, తన చదువును పూర్తి చేయాలనే సంకల్పంతో మళ్లీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇంటర్ బోర్డు ప్రత్యేక అనుమతితో కోరుట్లలోని మ్యాస్ట్రో జూనియర్ కళాశాలలో పరీక్ష రాశారు.

పరీక్ష అనంతరం మాట్లాడుతూ, న్యాయవాద విద్యను అభ్యసించి పేదల కోసం పనిచేయాలనేది తన లక్ష్యమని దేవ్‌జీ తెలిపారు. జీవితంలో చదువు ఎంతో ముఖ్యమని, యువత విద్య ద్వారా సమాజానికి సేవ చేయాలని సూచించారు.

Latest Articles

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భరోసా

ప్రభుత్వ పాఠశాలల్లో 580పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య నియోజకవర్గవ్యాప్తంగా 31 మంది గుర్తింపు విద్యార్థుల ఆసక్తికి తగిన విధంగా కోర్సుల ఎంపిక పవన్‌ చొరవతో ముందుకు వచ్చిన విద్యా సంస్థలు పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్