37.2 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

సౌత్ క్వీన్ త్రిష.. క్రేజీ లైనప్ అదిరింది..

త్రిష.. అగ్ర హీరోలతో నటించి దశాబ్ద కాలం పాటు టాప్ హీరోయిన్ గా ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుని వార్తల్లో నిలుస్తుంది. ఎంత మంది పోటీ ఉన్నా.. స్టార్ హీరోలు అండ్ డైరెక్టర్స్ సౌత్ క్వీన్ త్రిష వైపే చూస్తున్నారంటే.. ఎంత క్రేజ్ సొంతం చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రేజీ బ్యూటీ సినిమాలకు గుడ్ చెప్పేసి రాజకీయాల్లోకి వెళుతుంది అనుకుంటే.. భారీ, క్రేజీ సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంటుంది. ఇంతకీ.. త్రిష చేస్తున్న సినిమాలు ఏంటి..? తాజాగా వచ్చిన క్రేజీ ఆఫర్స్ ఏంటి..?

త్రిష తెలుగులో నీ మనసు నాకు తెలుసు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు.. తదితర చిత్రాలతో మెప్పించి కెరీర్ ఆరంభంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో అలరించింది. ఇంకా చెప్పాలంటే.. ఈ బ్యూటీ సౌత్ క్వీన్ గా పాపులర్ అయ్యింది. ఈమధ్య కాలంలో పొన్నియన్ సెల్వన్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష.. ఇప్పుడు వీరభద్రుడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో సూర్యకు జంటగా నటించింది. మే 14న వీరభద్రుడు మూవీ తెలుగు, తమిళ్ లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

త్రిష నుంచి రానున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ విశ్వంభర. గతంలో స్టాలిన్ మూవీలో చిరు, త్రిష జంటగా నటించారు. ఇరవై సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి విశ్వంభర మూవీలో నటించడం విశేషం. ఈ మూవీ ఆగష్టులో రిలీజ్ కి రెడీ అవుతోందని సమాచారం. ఇప్పుడు సీనియర్ హీరోలకు పర్ ఫెక్ట్ హీరోయిన్ అంటే త్రిష అని ఇండస్ట్రీ జనాల్లో బలంగా వినిపిస్తోంది. త్రిషకు సంబంధించి ఏ వార్త బయటకు వచ్చినా.. ఏ ఫోటో బయటకు వచ్చినా.. వెంటనే వైరల్ అయిపోతుంది. దీనిని బట్టి ఈ సౌత్ క్వీన్ కి ఎంతగా క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక తాజాగా వచ్చిన క్రేజీ ఆఫర్ ఏంటంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్శిల్ హీరో కమల్ హాసన్.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందే మూవీ కోసం కథానాయికగా త్రిషను ఫైనల్ చేశారనే వార్త టాలీవుడ్, కోలీవుడ్లో గట్టిగా వినిపిస్తోంది. ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య తనదైన నటనతో మెప్పించే అవకాశం రావడం త్రిష లైఫ్ లో అరుదైన ఘనత అని చెప్పచ్చు. అలాగే మోహన్ లాల్ నటిస్తున్న రామ్ అనే మూవీలో కూడా త్రిష నటిస్తుంది. సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. రాజకీయాల్లోకి వెళ్లిపోతుందని ప్రచారం జరుగుతున్న ఈ టైమ్ లో క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుండడం విశేషం.

Latest Articles

‘అల్లు అర్జున్ ప్రాపర్టీ’ అంటూ ట్రోల్.. ఘాటుగా బదులిచ్చిన హీరోయిన్

హీరోయిన్ సీరత్ కపూర్ సోషల్ మీడియాలో చేసిన ఓ రిప్లై ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న ఫోటోలను సీరత్ కపూర్ షేర్ చేయడం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్