37.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

రెండు పార్టులుగా విశ్వంభర.. ? ఇది నిజమా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ భారీ, క్రేజీ మూవీని మల్లిడి వశిష్ట్ తెరకెక్కించారు. అయితే.. విశ్వంభర ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరుకు విడుదల కాలేదు. ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే.. విశ్వంభర మూవీ రెండు పార్టులుగా రానుందనే కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. దీంతో ఇది నిజమా..? లేక గాసిప్పా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఇది నిజమేనా..?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరచిపోలేని సినిమాల్లో ఒకటి జగదేకవీరుడు అతిలోక సుందరి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఈ మూవీ వచ్చి 36 ఏళ్లు అవుతుంది. అయితే.. ఈ సినిమా తర్వాత చిరు ఆతరహా సోషియో ఫాంటసీ మూవీ చేయలేదు. మళ్లీ ఇప్పుడు అదే తరహాలో ఉండే సోషియో ఫాంటసీ మూవీగా విశ్వంభర చేస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రేజీ మూవీలో చిరుకు జంటగా త్రిష నటిస్తుంది. అయితే.. ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది కానీ.. ఇంత వరుకు ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. దీంతో విశ్వంభర అప్ డేట్స్ కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రేజీ మూవీ ఇంతవరుకు రిలీజ్ కాకపోవడానికి కారణం ఏంటంటే.. ఆమధ్య రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్ కు నెగిటీవ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వర్క్ ఏమాత్రం బాలేదనే టాక్ వచ్చింది. ఇక అక్కడ నుంచి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశ్యంతో మళ్లీ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు కానీ.. అవుట్ ఫుట్ ఆశించినట్టుగా రాకపోవడంతో మళ్లీ మళ్లీ వర్క్ చేస్తున్నారు. అందుకనే.. విశ్వంభర రావడం ఇంత ఆలస్యం అయ్యింది.

ఇదిలా ఉంటే.. లేటెస్ట్ గా విశ్వంభర మూవీని రెండు పార్టులుగా తీస్తున్నారనే ఓ న్యూస్ వైరల్ అయ్యింది. దీంతో.. ఇది నిజమా..? లేక గాసిప్పా..? అనే చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతుంది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్త పై డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ స్పందించారు. విశ్వంభర మూవీని రెండు పార్టులుగా చేసే ఆలోచనలో ఉన్నారనే వార్తకు.. అవునా..? నిజమా..? అంటూ స్పందించారు డైరెక్టర్ మల్లిడి వశిష్ట్. దీనిని బట్టి.. విశ్వంభర రెండు పార్టులుగా రావడం లేదు.. ఒక పార్టుగానే రాబోతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టు అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఎప్పుడు విశ్వంభర వచ్చేది అంటే.. జులై 10న ఈ సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. త్వరలో అనౌన్స్ చేస్తారని టాక్. మరి.. మెగాస్టార్ విశ్వంభర మూవీతో ఎంత వరుకు మెప్పిస్తారో.. ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Latest Articles

వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఎందుకు కోరారు? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఒక కీలక పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మోదీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్