బెంగాల్ లో గెలిచాం.. నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ- మోదీ

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని సాధించిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అక్కడి ప్రజలు సంకల్పంతో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. అదే విధమైన ప్రజా మద్దతు, ఉత్సాహం ఇప్పుడు తెలంగాణలో కూడా కనిపిస్తోందని తెలిపారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ, ‘‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు.

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని ఆయన అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పేర్కొంటూ, బెంగాల్‌లో ఓడిపోయింది ఒక రాజకీయ పార్టీ కాదని, రాజ్యాంగ వ్యతిరేక శక్తులేనని వ్యాఖ్యానించారు. అవినీతి, కుటుంబ రాజకీయాలకు ప్రజలు అక్కడ గట్టి బుద్ధి చెప్పారని తెలిపారు.

తెలంగాణ ప్రజలు కూడా అదే తరహాలో బీజేపీకి ఆశీర్వాదం ఇవ్వాలని మోదీ కోరారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో విజయం సాధించాం.. ఇప్పుడు మా తదుపరి లక్ష్యం తెలంగాణ. ఈసారి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోందని, బీజేపీ తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతోందని అన్నారు.

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్