తమిళ రాజకీయాల్లో సరికొత్త రికార్డు: మూడేళ్లలోపే అధికారానికి చేరువగా ‘టీవీకే’!

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త అధ్యాయం మొదలైంది. సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ, స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2024, ఫిబ్రవరి 2న పార్టీని ప్రకటించిన విజయ్, కేవలం రెండేళ్ల 3 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో ప్రధాన శక్తిగా అవతరించడం విశేషం.

చరిత్రను తిరగరాస్తున్న విజయ్

సాధారణంగా తమిళనాడులో డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) వంటి బలమైన పునాదులున్న పార్టీలను ఢీకొట్టడం అసాధ్యమని భావిస్తారు. గతంలో ఎం.జి. రామచంద్రన్ (MGR) ఏఐఏడీఎంకే స్థాపించిన 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి రాగా, విజయ్ ఇప్పుడు ఆ రికార్డును కూడా అధిగమించేలా కనిపిస్తున్నారు.
ప్రస్తుత 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ప్రకారం, టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ (118 స్థానాలు) దిశగా దూసుకుపోతోంది. ఇది దక్షిణ భారత రాజకీయాల్లోనే ఒక పెను సంచలనం

దేశవ్యాప్తంగా తక్కువ సమయంలో అధికారం పొందిన ఇతర పార్టీలు:

భారతదేశంలో పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన సందర్భాలు చాలా తక్కువ. ఆ జాబితాలో ప్రముఖంగా నిలిచేవి..

తెలుగుదేశం పార్టీ (TDP): 1982లో ఎన్.టి. రామారావు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP): 2012లో ఏర్పాటైన ఈ పార్టీ, కేవలం 13 నెలల వ్యవధిలోనే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అసోం గణ పరిషత్ (AGP): పార్టీ స్థాపించిన కేవలం 2 నెలల్లోనే అసోంలో అధికారాన్ని చేజిక్కించుకుంది

విజయ్ విజయానికి కారణాలు

విజయ్ కు ఉన్న అశేష అభిమాన గణం, క్షేత్రస్థాయిలో యువత మద్దతు , ప్రభుత్వ వ్యతిరేకత, మార్పు కోరుకునే ఓటర్ల ఆదరణ టీవీకేను గెలుపు ముంగిట నిలబెట్టాయి. ఒకవేళ విజయ్ అధికారంలోకి వస్తే, అతి తక్కువ కాలంలో సీఎం అయిన అతికొద్ది మంది నాయకుల జాబితాలో ఆయన చేరుతారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్