‘హోం టౌన్’ ట్రైలర్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

మన ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో రూపొందిన వెబ్ సిరీస్ ‘హోం టౌన్’. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌కు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. ఏప్రిల్ 4 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. హోం టౌన్ ట్రైలర్ తనకు బాగా నచ్చిందని చెప్పిన విజయ్..వెబ్ సిరీస్ టీమ్‌కు తన బెస్ట్ విశెస్ అందించారు.

హోం టౌన్ వెబ్ సిరీస్ ట్రైలర్ ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకుంది. ఉపాధి కోసం సొంతూర్లను వదిలి వచ్చినా, ఆ జ్ఞాపకాలను మాత్రం మర్చిపోలేం. మళ్లీ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేలా ట్రైలర్ ఉంది. జ్యోతి ఫొటో స్టూడియో జీవనోపాధిగా ఉన్న రాజీవ్ కనకాల..తన కొడుకు శ్రీకాంత్ (ప్రజ్యల్ యాద్మ)ను విదేశాల్లో చదివించి గొప్ప స్థాయిలో చూడాలనుకుంటాడు. కానీ శ్రీకాంత్ ఫ్రెండ్స్ తో సరదాగా గడిపే ఓ సగటు మధ్య తరగతి కుర్రాడు, అతనికి చదువుల మీద శ్రద్ధ ఉండదు. ఇక్కడే కుటుంబంలో సంఘర్షణ ఏర్పడుతుంది. తండ్రి కోరుకున్నట్లు శ్రీకాంత్ విదేశాల్లో చదివేందుకు ఒప్పుకున్నాడా లేదా, కొడుకును విదేశాల్లో చదివించేందుకు మధ్య తరగతి తండ్రి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది హోం టౌన్ వెబ్ సిరీస్ ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. ఝాన్సీ, అనీ, రాజీవ్ కనకాల, ప్రజ్వల్ యాద్మ తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు. ఈ సిరీస్ కు దేవ్ దీప్ గాంధీ కుండు సినిమాటోగ్రాఫర్ కాగా…సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు.

Latest Articles

స్వతంత్ర న్యూస్‌ చానెల్ 4వ వార్షికోత్సవం..హాజరైన అతిరథమహారథులు

స్వతంత్ర న్యూస్‌ చానెల్ 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. నాలుగేళ్ల కిందట జూన్‌ 26న స్వతంత్ర టీవీ ప్రస్థానం ప్రారంభమైంది. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని బేగంపేట్‌ ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్