కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించడం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బాధ్యతని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయనకు సీఎం లేఖ రాశారు. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగానే చెన్నై, బెంగళూరు మెట్రో విస్తరణకు ఆమోదం లభించిందని చెప్పారు. హైదరాబాద్‌ మెట్రోపై మాత్రం పలుమార్లు విజ్ఞప్తి చేసినా పురోగతి లేదని విమర్శించారు. సబర్మతి, గంగా పునరుజ్జీవనంపై కిషన్‌రెడ్డి పలుమార్లు ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. మూసీపై ఎందుకు విషం చిమ్ముతున్నారని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో కిషన్‌రెడ్డి పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రాజెక్టులపై మాట్లాడితే.. తమని అడిగి ఇచ్చారా? అంటూ విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. నాది అవగాహనా రాహిత్యమని కిషన్‌రెడ్డి అనడం తీవ్ర అభ్యంతరకరం అని సీఎం అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం సమంజసం కాదన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని లేఖలో సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్