రెడ్ క్రాస్ సేవలు బలోపేతం చేయాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ తన సమాజ హిత కార్యక్రమా లను విస్తృత పరచి ప్రజలకు సేవలు మరింత చేరువ చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.

రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ కు నూతన చైర్మన్ గా ఎన్నికైన వై. డి. రామారావు, కోశాధికారిగా ఎన్నికైన పి. రామచంద్ర రాజు, ప్రధాన కార్యదర్శి AK పరిడాతో కలిసి మర్యాదపూర్వకంగా రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిశారు. ఈ సందర్భంగా
గవర్నర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 20 రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రాలలో ప్రజలకు నాణ్యమైన రక్త సేవలు అందుతున్నాయని, రాబోయే రోజుల్లో అన్ని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్ ను ఆధునికరించి ఇంకా మెరుగైన రక్త సేవలను ప్రజలకు అందజేయాలని ఆయన తెలిపారు.

భారత దేశములోనే తొలి సారి సింగల్ యూజ్ ప్లాస్టిక్ రహిత సమాజము ఏర్పాటే ధ్యేయంగా రెడ్ క్రాస్ గుంటూరు శాఖ ప్రతిష్టత్మాకంగా చేపట్టనున్న “వార్ ఆన్ సింగిల్ యుజ్ ప్లాస్టిక్ ” పైలెట్ పాజెక్ట్ ను మార్చి నెలలో తాను గుంటూరు నగరంలో ప్రారంభిస్తానని గవర్నర్ తెలిపారు.

విజయవాడలో రెడ్ క్రాస్ భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్బంగా చైర్మన్ గా ఎన్నికైన రామారావు, కోశాధికారిగా ఎన్నికైన రామచంద్ర రాజులను గవర్నర్ అభినందిస్తూ వారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ చేపట్టబోయే అన్నీ సేవా కార్యక్ర ములకు తన సహాయ, సహకారాలు అందజేస్తానని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్