మంత్రి తుమ్మలతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్లు భేటీ

ఈ రోజు సచివాలయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలని కలవడం జరిగింది. ఈ సందర్భంగా సహకార సంఘాల పాలకవర్గ పదవీకాలం ఈ నెలలో ముగియనున్న నేపథ్యంలో, వారి పదవీకాలాన్ని పొడిగించాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు. మంత్రి స్పందిస్తూ, ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పదవీకాల పొడగింపుకు కృషి చేస్తానన్నారు.
అలాగే, సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ సమగ్ర ప్రాజెక్ట్ నివేదికకు (డిపిఆర్) సంబంధించిన సాంకేతిక అనుమతుల దస్త్రం ఈ రోజు సాంకేతిక సలహా కమిటీ ముందుకు వెళ్లనున్న నేపథ్యంలో, ఈ అంశంపై ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి, ఇరిగేషన్ అడ్వైజర్, ఇరిగేషన్ సీఈలను కలిసి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్