సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో… కేటీఆర్ ఈ నెల 8న సుప్రీంకోర్టులో SLP దాఖలు చేశారు. KTR దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం నేడు విచారణ జరపనుంది. ఈ కేసు సుప్రీంకోర్టులోని కోర్టు హాల్‌లో 37వ నెంబర్‌గా లిస్ట్ చేయబడింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే ముందే.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసులో ముందుగానే స్పందించింది. ఏసీబీ కేసుపై ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసి, హైకోర్టు తీర్పుపై కేటీఆర్ పిటిషన్ వేస్తే తమ వాదనలూ వినాలని కోరింది. కేటీఆర్ పిటిషన్‌కు సంబంధించిన విచారణ… ప్రభుత్వ వాదనలు నేడు సుప్రీంకోర్టులో కీలకంగా ఉండనున్నాయి.
నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ విచారణ
0
269
Previous article
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


