తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై విస్తృత చర్చ జరగనుంది. ముఖ్యంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే అభివృద్ధి కార్యక్రమాల అమలుపై వివరాలు పరిశీలించనున్నారు. తాజాగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు దృష్ట్యా, ప్రభుత్వ పథకాల ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో, రేపు జరగబోయే సమావేశంలో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు పద్ధతులు, ఇంకా చేపట్టవలసిన చర్యల గురించి కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు.
సచివాలయంలో కీలక అంశాలపై చర్చించనున్న సీఎం
0
214
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


