ఒకే విడతలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్‌ విడుదల

ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

జనవరి 10న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ జనవరి 17 గా ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 20. అలాగే ఫిబ్రవరి 5 వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 8 వ తేదీన ఢీల్లి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు.

దేశ రాజధానిలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో 2.08 లక్షల మంది తొలి ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 13వేల 33 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపరు. అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను అందుబాటులో ఉంచనున్నారు. అలాగే 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్