కేవీ రావు నాపై తప్పుడు ఆరోపణలు చేశారు- విజయసాయిరెడ్డి

కాకినాడ సెజ్‌, సీ పోర్ట్‌ షేర్ల బదలాయింపులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారులు విజయసాయిరెడ్డిని విచారించారు. విజయసాయిరెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయసాయిరెడ్డి.. ఈడీ అధికారులు మొత్తం 25 ప్రశ్నలు అడిగారని చెప్పారు. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసిందన్నారు.

కేవీ రావు ఎవరో నాకు తెలియదని చెప్పాను. అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కాకినాడ సీ పోర్ట్ విషయంలో కేవీ రావుకు ఎక్కడా నేను ఫోన్ చేయలేదు. కేవీ రావును తిరుమలకు రమ్మని చెప్పమని చెప్పండి అని చెప్పాను. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. మే నెల 2020లో నేను ఫోన్ చేశానని కేవీ రావు చెబుతున్నాడు. కాల్ డేటా తీసి నేను కాల్ చేశానో లేదో చూసుకోవచ్చు. నేను ఎక్కడ కూడా కేవీ రావుకు ఫోన్ చేయలేదు. కేవీ రావును ఈడీ విచారణకు పిలవండి అని కోరాను. రంగనాధ్ కంపెనీని ప్రభుత్వానికి ఎవరు పరిచయం చేశారని ఈడీ అధికారులు ప్రశ్నించారు. నాకు సంబంధం లేదని చెప్పాను. నేను ఒక సాధారణమైన ఎంపీని మాత్రమే. శ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవరు అపాయింట్ చేశారో నాకు తెలియదని చెప్పాను. శరత్ చంద్రారెడ్డితో ఉన్న సంబంధాలు కూడా అడిగారు. కుటుంబ రిలేషన్ అని చెప్పాను. కాకినాడ సీ పోర్ట్ విషయంలో నాకు లుకౌట్‌ నోటీసులు ఇచ్చారు. లుకౌట్‌ నోటీసులపై నేను ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాను. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసయితే నేను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీకి చెప్పాను.

విక్రాంత్ రెడ్డి తెలుసా అని అడిగారు. విక్రాంత్ రెడ్డితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరుపలేదు. సండుర్ పవర్ కంపెనీలో 22 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి అడిగారు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి ఇప్పుడు చెప్పడం కుదరదని చెప్పాను.. అని విజయసాయిరెడ్డి అన్నారు

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్