పేర్ని జయసుధకు ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు ఊరట లభించింది. ఆమెకు కృష్ణ జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్‌ బియ్యం మిస్సింగ్‌ కేసులో జయసుధ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసు విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. మచిలీపట్నంలో రేషన్‌ బియ్యం మాయం కేసులో పోలీసులు తనను అరెస్టు చేయొచ్చన్న సమాచారంతో పేర్ని జయసుధ అజ్ఞాంతలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

మరోసారి నోటీసులు

లెక్క తేల్చిన బియ్యానికి ఫైన్ కట్టమని చెబుతూ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మరోసారి నోటీసులు ఇచ్చారు. గోడౌన్‌లో బియ్యం మాయంపై ఇటీవల పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణ చేపట్టారు. తొలుత 185 మెట్రిక్ టన్నులకు డబుల్ పెనాల్టీగా జయసుధ రూ.1.79 కోట్లు జరిమానా కట్టారు. ఇక పూర్తి స్థాయి విచారణ అనంతరం 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు గుర్తించారు. పెరిగిన షార్టేజీకి కూడా ఫైన్ చెల్లించాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీనికి అదనంగా రూ.1.67కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన సివిల్ సప్లయిస్ బఫర్ గోడౌన్ లో మాయమైన రేషన్ బియ్యం లెక్క తేల్చిన అధికారులు అందుకు సంబంధించి డబుల్ పెనాల్టీ చెల్లించాలని గోడౌన్ యజమానురాలు జయసుధకు నోటీసులు ఇచ్చారు. తొలుత 185 టన్నుల బియ్యం మాయమైనట్టు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు.. అందుకు సంబంధించి డబుల్ పెనాల్టీ కింద రూ.1.70 కోట్లు ఫైన్ వేశారు. ఈ మొత్తాన్ని లాయర్ల ద్వారా రెండు డీడీలుగా చెల్లించారు. ఆ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన అధికారులు మొత్తం 378 మెట్రిక్ టన్నులు షార్టేజీ వచ్చినట్టు నిర్ధారించారు. షార్టేజీ వచ్చిన మొత్తం బియ్యానికి డబుల్ పెనాల్టీగా రూ.3.37కోట్లు ఫైన్ విధించారు. గతంలో చెల్లించిన రూ. కోటి 70 లక్షలు మినహాయించి మిగిలిన రూ.1.67 కోట్లు చెల్లించాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ.. గోడౌన్ యజమానురాలు పేర్ని జయసుధకు నోటీసులు జారీ చేశారు.

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్