సంగారెడ్డి జిల్లా అందోలులోని గురుకుల పాఠశాలలో మూడు రోజుల పాటు జరిగిన టెన్త్ జోనల్ లెవల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ముగిశాయి. ముగింపు వేడుకలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో పాటు కబడ్డీ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. క్రీడలతో మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం పెరుగుతుందని మంత్రి తెలిపారు. నిత్య యవ్వనం ఉట్టిపడుతుందన్నారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిమ కనబరిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. దాంతో పాటు క్రీడాకారుల కోటాలో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పారు.
కబడ్డీ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించిన మంత్రి దామోదర
0
242
Previous article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


