కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం ఎగ్గొట్టడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. చేతకాని హామీలు ఇవ్వడమెందుకు, అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడం ఎందుకని ప్రశ్నించారు. అడ్డగోలు నిర్ణయాలతో అన్నదాతను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతోషంగా సాగిన వ్యవసాయాన్ని సంక్షోభంగా మార్చారని విమర్శించారు. నిన్న వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు, నేడు యాసంగి పెట్టుబడి సాయానికి పాతరేస్తారట అని ఫైరయ్యారు. దగా పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రైతులకు రేవంత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అని నిలదీశారు. రేవంత్ ఏడాది పాలనలో తెలంగాణ రైతుకు గోస తప్ప భరోసా లేనే లేదని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం ఎగ్గొట్టడంపై కేటీఆర్ ఫైర్
0
125
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


