తొలిసారి ఏపీ అసెంబ్లీలో 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. రెవెన్యూ వ్యయం అంచనా 2.34 లక్షల కోట్లు కాగా.. మూలధన వ్యయం 32.712 కోట్లుగా నాలుగు నెలల కాలానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంటే అంకెకు మించిన ప్రాముఖ్యత ఉందన్నారు పయ్యావుల కేశవ్. ఇక ఈ సందర్భంగా గత పాలకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని తగ్గించారని మండిపడ్డారు. రాజధాని లేకుండా లోపభూష్టయిమన విధానాలకు అనుసరించారని.. వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు.
సంక్షేమానికి పెద్దపీట వేస్తూ స్వర్ణాంధ్ర 2047 దిశగా ఎన్నో పథకాలను రూపొందిస్తోందన్నారు పయ్యావుల. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ.. అధికారం చేపట్టిన వెంటనే సామాజిక భద్రత పెన్షన్‌ను 3 వేల నుంచి 4 వేల రూపాయలకు పెంచామన్నారు పయ్యావుల కేశవ్. షెడ్యూల్ తెగల సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు పయ్యావుల కేశవ్. గిరిజనుల సంక్షేమం కోసం పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, RTF, MTF అంబేద్కర్ విద్యా నిధి వంటి ముఖ్య పథకాలను అమలు చేస్తున్నారు.