ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు. ఏపీ సచివాలయంలో సీఆర్డిఏ అథారిటీకి చైర్మన్ హోదాలో సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 29వ సీఆర్డిఏ అథారిటీ సమావేశంలో పలు కీలక విషయాలపై మంత్రులు, అధికారులతో చర్చిస్తారు. ఈ సమీక్షకు మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
గతంలో అమరావతి నిర్మాణానికి టెండర్లు పొందిన సంస్థల ఒప్పందాల రద్దుపై నిర్ణయం తీసుకోనున్నారు. తాజాగా మరోసారి టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. గతంలో ఇచ్చిన రేటుకు నిర్మాణాలు చేపట్టలేమని గుత్తేదారులు చెబుతున్నారు. దీంతో కొత్తగా టెండర్లు పిలిచేందుకు మార్గం సుగమం చేయడంలో భాగంగా ఈరోజు సీఆర్డీఏ అథారిటీ కీలక సమావేశం జరగనుంది. అనంతరం నూతన స్పోర్ట్స్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు.