ఏపీకి మరో అల్పపీడనం ముప్పు ఉందని హెచ్చరించింది వాతావరణశాఖ. ఇప్పటికే రాష్ట్రంలో కుండపోత వానలు కురుస్తుండగా.. అక్టోబరు 22న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ముప్పు
0
154
Previous article
Next article
Latest Articles
విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ ఉద్యమం
విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుంది. తొలి దశ ప్రచారాన్ని హస్తం పార్టీ ప్రకటించింది. పేపర్ లీక్‌లు, పరీక్షల అవకతవకలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. రాహుల్ గాంధీ విద్యార్థి...
- Advertisement -
- Advertisement -


