సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ

తిరుమల లడ్డూ వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని హిందువుల మనోభావాలను దెబ్బతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో పాటు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా వేర్వేరుగా పిటీషన్లు వేశారు.

దీనిపై నాలుగు రోజుల క్రితం విచారించిన సుప్రీంకోర్టు.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారన్న ఆధారాలు లేవని అభిప్రాయపడింది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంకు విచారణకు కూడా ఆదేశించింది. కానీ సిట్ విచారణ జరిపితే ఏకపక్షంగా విచారణ సాగుతుందని పిటిషనర్ల తరుపున న్యాయవాదులు చెప్పారు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలని కోరారు. అయితే దీనిపై సోలిసిటర్ జనరల్ అభిప్రాయం తీసుకుని అక్టోబరు 3వ తేదీన ప్రకటిస్తామని తెలిపింది. దీంతో నేడు దర్యాప్తు ఎవరి చేతుల్లోకి వెళ్లనుందన్నది నేడు సుప్రీంకోర్టు తేల్చనుంది. మరోవైపు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సిట్‌ దర్యాప్తును కూడా ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది.

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్