తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం

తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసి ప్రజావాణి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రజావాణి కార్యక్రమం మాదిరిగానే ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి ప్రారంభించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నా షేక్ హుస్సేన్ కుటుంబం నుండి మొదటి అభ్యర్థనను మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు. సమస్యల వినతి కోసం గల్ఫ్ కార్మికులు భారీగా పాల్గొన్నారు.

ప్రజావాణి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున ఉపాధి నిమిత్తం వెళ్ళారని తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ప్రవాసి ప్రజావాణి ఉపయోగపడుతుందన్నారు. గల్ఫ్ ప్రమాదంలో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్ఫ్ గ్రెషీయ ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేసుకున్నామన్నారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కల్పిస్తున్నామని తెలిపారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్