28.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

సెప్టెంబర్ 13 నుంచి కీర్తి సురేష్ ‘రఘు తాత’ స్ట్రీమింగ్

మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రఘు తాత. హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆడియెన్స్ థియేటర్లో మంచి రెస్పాన్స్‌ను ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన సందర్భంగా..

కీర్తి సురేశ్‌ మాట్లాడుతూ.. ‘నమ్మిన దాని కోసం నిలబడే ఓ ధైర్యశాలి పాత్రను రఘు తాత చిత్రంలో పోషించడం ఆనందంగా ఉంది. ఆ పాత్రకు జీవం పోయడం ఓ సవాలుగా అనిపించింది. ZEE5లో ఈ ఆకర్షణీయమైన కథనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ అవుతుండటం సంతోషంగా ఉంది’ అని అన్నారు.

హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. ‘‘రఘుతాత’ ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ కోసం ZEE5తో భాగస్వామి అయినందుకు మాకు సంతోషంగా ఉంది. విజువల్ ట్రీట్, ఎమోషనల్ జర్నీగా సాగే రఘు తాత చిత్రం ఈ ZEE5 ద్వారా అందరి వద్దకు చేరుతోంది. ‘రఘుతాత’ అనేది మాకు ఒక ప్రత్యేక ప్రాజెక్ట్. ఇది సున్నితత్వం, హాస్యంతో ఉండటమే కాదు సామాజిక సమస్యలను తెలియజేస్తుంది’ అని అన్నారు.

దర్శకుడు సుమన్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రఘుతాత’ సినిమా మా జీవితంలో ఓ మరుపురాని ప్రయాణంగా నిలుస్తుంది. ఈ చిత్రం భాషా, ప్రాంతం అన్న తేడా లేకుండా అందరినీ అలరించగలిగింది. ఇక ZEE5లో ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ కోసం ఎదురు చూస్తున్నాను’ అని అన్నారు.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్