23.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంపై నౌకాదళం దర్యాప్తు

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో ఉన్న 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం నిన్న బలమైన గాలులకు కూలిపోయింది. ఈ విగ్రహాన్ని గతేడాది డిసెంబరు 4న నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించారు. విగ్రహం కూలిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి.

మరోవైపు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహం కూలిన ఘటనపై భారత నౌకాదళం విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి వీలైనంత త్వరగా విగ్రహం మరమ్మతులు చేపట్టేందుకు ఒక బృందాన్ని నియమించినట్లు తెలిపారు. నేవీ, మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ తో సంబంధిత నిపుణులు ప్రమాదానికి గల కారణాన్ని పరిశోధిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ధ్వంసం ఘటనలో కాంట్రాక్టర్ జైదీప్ ఆప్టే, స్ట్రక్చరల్ కన్సల్టెంట్ చేతన్ పాటిల్‌లపై భారత న్యాయ స్మృతి పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సింధుదుర్గ్ పోలీసులు తెలిపారు.

మరోవైపు, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన తర్వాత విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని.. భారత నావికాదళం ఏర్పాటు చేసిందన్నారు. ఛత్రపతి శివాజీ మనకు ఆదర్శం, ఆయన విగ్రహమే మనకు గుర్తింపు.. విగ్రహం డిజైన్‌ను కూడా నేవీ సిద్ధం చేసింది అని సీఎం గుర్తు చేశారు.

Latest Articles

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ అభివృద్ధికి సహకరించండి- శ్రీధర్‌బాబు

'కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్‌గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్