ఆసక్తికరంగా ‘రహస్యం ఇదం జగత్‌’ రిలీజ్‌ డేట్‌ గ్లింప్స్‌

కొత్తదనంతో కూడిన చిత్రాలను, వైవిధ్యమైన కథలను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. ఇక వాళ్లతో ఆసక్తిని కలిగించే సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్‌ అంటే.. అందునా మన పురాణాలు, ఇతిహాసాల గురించి ఏదైనా అంశంతో రూపొందిన చిత్రమంటే ఎంతో ఆసక్తితో చూస్తారు. సరిగ్గా అలాంటి జానర్‌లోనే రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్‌’. సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డేట్‌ అనౌన్స్‌మెంట్‌ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నవంబరు 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా ఈ గ్లింప్స్‌లో ప్రకటించారు.

ఈ గ్లింప్స్‌ను చూస్తుంటే.. మన పురాణాలు, ఇతిహాసాల్లోని ఆసక్తికరమైన పాయింట్‌ను తీసుకొని ఈ చిత్రం రూపొందించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మన శ్రీచక్రం గురించి చెబుతున్న పాయింట్‌ అందరికి గూజ్‌బంప్స్‌ తీసుకొచ్చే విధంగా వుంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని ఈ గ్లింప్స్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మాసస వీణ, భార్గవ్‌ గోపీనాథం, కార్తీక్‌ కండాల, శివకుమార్‌ జుటూరి, ఆది నాయుడు, లాస్య రావినూతుల తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: టైలర్‌ బ్లుమెల్‌, సంగీతం: గ్యానీ, ఎడిటర్‌: చోటా.కె.ప్రసాద్‌, రైటర్‌: రవితేజ నిట్ట, సహ నిర్మాతలు: రాకేష్‌ గలేబి, కోమల్‌ రావినూతుల ఎగ్జక్యూటివ్‌ నిర్మాత: హరీష్‌ రెడ్డి గుండ్లపల్లి , అసోసియేట్‌ నిర్మాతలు: విన్సెంట్‌ ఫామ్‌, జాన్‌ షా నిర్మాతలు పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల, రచన-దర్శకత్వం: కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్