కొత్త దర్శకుడితో నాగశౌర్య నెక్ట్స్ మూవీ

హీరో నాగ శౌర్య తన నూతన చిత్రాన్ని అనౌన్స్ చేశారు. డెబ్యుటెంట్ రామ్ దేశిన (రమేష్) దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై న్యూకమ్మర్ శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ నూతన చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైయింది.

డైరెక్టర్ రమేష్, ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, వైవిఎస్ చౌద, శ్రీను వైట్ల వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. అనేక విజయవంతమైన చిత్రాలకు సహ రచయితగా పనిచేశారు.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రంలో సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్‌లతో సహా ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పనిచేస్తుండగా హారిస్ జయరాజ్ తెలుగు సినిమాకి కంబ్యాక్ ఇస్తూ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను రాజీవ్ నాయర్ పర్యవేక్షించగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేస్తున్నారు.

నటీనటులు: నాగ శౌర్య, సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వి, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్)
నిర్మాత: శ్రీనివాసరావు చింతలపూడి
బ్యానర్: శ్రీ వైష్ణవి ఫిల్మ్స్
డీవోపీ: రసూల్ ఎల్లోర్
సంగీతం: హారిస్ జైరాజ్
ఆర్ట్: రాజీవ్ నాయర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, పృథ్వీ
కొరియోగ్రాఫర్లు: రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్, VJ శేఖర్, శోబి పాల్రాజ్
లిరిక్స్: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: సుధాకర్ వినుకొండ
పీఆర్వో: వంశీ-శేఖర్

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్